Payal: దూసుకుపోతోన్న 'ఆర్ డి ఎక్స్ లవ్' టీజర్

  • పాయల్ తదుపరి సినిమా 'ఆర్ డి ఎక్స్ లవ్'
  • అడల్ట్ కంటెంట్ తో వచ్చిన టీజర్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

'ఆర్ ఎక్స్ 100' సినిమాలో పాయల్ రాజ్ పుత్ చేసిన అందాల సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో ఆమె అందాల ఆరబోత కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ సినిమాతోనే యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. మరికొన్ని రోజుల్లో ఆ క్రేజ్ రెట్టింపు కానుందనే విషయాన్ని ఇటీవల వచ్చిన 'ఆర్ డి ఎక్స్ లవ్' సినిమా టీజర్ స్పష్టం చేసింది.

శంకర్ భాను దర్శకత్వంలో తేజు కంచర్ల హీరోగా 'ఆర్ డి ఎక్స్ లవ్' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. గ్లామర్ ఒలకబోసే విషయంలో ఈ సుందరి 'ఆర్ ఎక్స్ 100' కి మించి రెచ్చిపోయింది. అడల్ట్ కంటెంట్ తో ఈ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతూ, 2.5 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News