జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అరెస్ట్

Sat, Aug 31, 2019, 11:57 AM
  • కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్దన్ రాజు అరెస్ట్
  • ఈ నెల 26న జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు
  • ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, చిత్తూరు జిల్లా కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్దన్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 26న తలకోనలో ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై జనార్దన్ అనుచిత వ్యాఖ్యాలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో, ఆయనను సీఐ సురేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు. మరోవైపు, అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad