bihar: హిందువుల నిర్వహణలో ఆ ఊరి మసీదు!

  • లౌకిక వాదానికి ప్రత్యక్ష తార్కాణం బీహార్‌లోని మారి గ్రామం
  • ఒకప్పుడు గ్రామంలో హిందూముస్లిం కుటుంబాలు
  • ప్రస్తుతం ముస్లింలు లేక మసీదు బాగోగులు చూస్తున్న హిందువులు

భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విధానం. లౌకిక వాదం మన తత్వం. సహనం, సమైక్యత, సుహృద్భావాలు మన ప్రజాస్వామ్యానికి పునాదులు. కుల, మత, జాతి వైషమ్యాలు రాజకీయ పార్టీల సృష్టికావచ్చేమోగాని ప్రజల మధ్య  వాస్తవంగా ఉండవు అనేందుకు ఇది చక్కని ఉదాహరణ. అంతా హిందువులే ఉన్న గ్రామంలోని మసీదును అక్కడి హిందువులే గత కొన్నేళ్లుగా నిర్వహిస్తుండడం విశేషం.

వివరాల్లోకి వెళితే... బీహార్‌ రాష్ట్రంలోని చారిత్రక నలంద పట్టణం సమీపంలో ఉన్న మారి గ్రామంలో ఒకప్పుడు హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉండేవారు. ఇందుకు సాక్ష్యంగా ఊరి పరిధిలో దేవాలయాలతోపాటు దశాబ్దాల చరిత్ర ఉన్న ఓ మసీదు కూడా ఉంది. కాలక్రమంలో వృత్తి, ఉపాధి వెతుక్కుంటూ గ్రామస్థులు పట్టణాలకు వలస వెళ్లిపోయారు.

ప్రస్తుతం గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. దీంతో మసీదును అక్కడి గ్రామంలోని హిందువులే నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మసీదును శుభ్రం చేస్తారు. నమాజ్‌ సమయాల్లో టేప్‌ రికార్డర్ ద్వారా నమాజ్‌ను ప్లే చేస్తారు. గ్రామంలో పెళ్లి చేసుకున్న నూతన జంటలు తొలుత మసీదుకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్లడం ఆనవాయతీగా కొనసాగుతుండడం విశేషం.

More Telugu News