vizag: విశాఖలోని హుందాయ్ షోరూంలో అగ్నిప్రమాదం..తగలబడుతున్న కార్లు!

  • ఎంవీపీ డబుల్ రోడ్డులోని షోరూంలో ఘటన
  • ఎగసిపడుతున్న మంటలు
  • మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

విశాఖలోని హుందాయ్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఎంవీపీ డబుల్ రోడ్డులో ఉన్న ఈ షోరూంలో మంటలు ఎగసిపడుతున్నాయి. కార్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. విక్రయాల నిమిత్తం ఉంచిన కార్లతో పాటు సర్వీసింగ్ కు వచ్చిన కార్లు కూడా అధిక సంఖ్యలో అక్కడ ఉన్నాయి. ఈ సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News