Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు చెప్పులు కానుకగా ఇచ్చిన అభిమాని

  • రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటన
  • అభిమాని ప్రేమతో ఇచ్చిన పాదరక్షలను స్వీకరించిన జనసేనాని
  • పర్యటనలో కొత్త చెప్పులతో నడక

జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. పలు గ్రామాల రైతులతో మాట్లాడడంతో పాటు రాజధానిలో నిర్మాణం జరుపుకుంటున్న ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా నిడమర్రు గ్రామంలో పర్యటిస్తుండగా ఓ అభిమాని పవన్ ను ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ యువకుడు కొత్త చెప్పుల జతను పవన్ కు కానుకగా ఇచ్చాడు. తమ ప్రాంతానికి పవన్ రావడం ఇదే ప్రథమం కాబట్టి, ఈ కానుక ఇచ్చానని, తాను బహూకరించిన చెప్పులతో పవన్ రాజధాని ప్రాంతంలో నడవాలని కోరుకుంటున్నానని ఆ యువకుడు వివరించాడు. ఆ అభిమాని ఇచ్చిన కానుకను స్వీకరించిన పవన్ తన పర్యటనలో ఆ కొత్త చెప్పులను ధరించారు.

More Telugu News