Nara Lokesh: సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని ఇంత నీచప్రచారానికి దిగుతారా?: జగన్ పై లోకేశ్ ఫైర్

  • రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు రోడ్డున పడ్డారంటూ లోకేశ్ ఆవేదన
  • పేదలకు అండగా టీడీపీ సాగిస్తున్న పోరాటాలను మార్ఫింగ్ కుట్రలతో పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం
  • తుగ్లక్ కు జగన్ కు ఏమీ తేడాలేదంటూ వ్యంగ్యం

రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రం కావడంతో భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ గళం విప్పారు. కార్మికులకు మద్దతు పలికిన లోకేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇసుక పనుల్లేక పేదవాళ్లు అల్లాడుతుంటే సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పేదలకు సాయం చేయకపోగా, కార్మికులకు అండగా నిలబడి టీడీపీ చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు సోషల్ మీడియాను వాడుకుని నీచ ప్రచారానికి దిగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ కుట్రలతో ప్రజల ఆవేదనను అపహాస్యం చేస్తారా? అంటూ నిలదీశారు.

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ ఇవాళ మంగళగిరిలో టీడీపీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ ధర్నాలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తుగ్లక్ పరిపాలన గురించి విన్నామని, ఇప్పుడది వైఎస్ జగన్ గారి రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని ఎద్దేవా చేశారు.

More Telugu News