ఒక్క క్లిక్ తో వినాయకుడితో పాటు సంపూర్ణ పూజా సామగ్రి!

30-08-2019 Fri 12:28
  • ఆల్ ఇన్ వన్ కిట్ అందిస్తున్న 'ఆరాధ్య' ఆన్ లైన్ కంపెనీ
  • వినాయకుడితో పాటు 18 రకాల పూజా సామగ్రి, 21 రకాల పత్రులు
  • హైదరాబాద్, విజయవాడల్లో పికప్ పాయింట్ల ఏర్పాటు
అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటూ గణనాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ, వినాయకచవితిని ఘనంగా చేసుకుంటుంటాం. అయితే, వినాయకుడి పూజకు అవసరమైన పూజా సామగ్రి, పత్రిని సేకరించడం అంత సులువైన పని కాదు. అసలు పూజకోసం ఏయే రకాల పత్రిని సేకరించాలో కూడా మనలో చాలా మందికి తెలియదు.  

ఇప్పుడు ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టింది 'ఆరాధ్య' అనే ఆన్ లైన్ కంపెనీ. వినాయకుడి పూజకు అవసరమైన మట్టి వినాయకుడితో పాటు, 18 రకాల పూజా సామగ్రి, 21 రకాల పత్రులను ఓ ప్యాక్ ద్వారా భక్తులకు అందిస్తోంది. అయితే, ఈ వెసులుబాటు హైదరాబాద్, విజయవాడ వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రెండు నగరాలవాసుల కోసం పికప్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాదులో 17, విజయవాడలో 2 పికప్ పాయింట్లను ఏర్పాటు చేశారు. పికప్ పాయింట్ల వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://aaradhyakit.com/pickup_locations.php 

మరోవైపు, www.aaradhyakit.com వెబ్ సైట్లోకి లాగిన్ అయి కూడా కిట్ ను బుక్ చేసుకోవచ్చు. మొత్తం మూడు రకాల కిట్లను వీరు అందిస్తున్నారు.
  • 9 ఇంచుల గణేశ్ విగ్రహంతో పాటు సంపూర్ణ పూజా సామగ్రి - రూ. 999. 
  • 6 ఇంచుల విగ్రహంతో పాటు సంపూర్ణ పూజా సామగ్రి - రూ. 899
  • 6 ఇంచుల విగ్రహంతో పాటు మినీ పూజా కిట్ - రూ. 499
సెప్టెంబర్ 2న వినాయక చతుర్థి జరగనుంది. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పికప్ పాయింట్ల వద్ద కిట్ లను కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది.

భక్తులకు వినాయకుడి కిట్ ను అందించాలనే ఆలోచన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మదిలో మొలకెత్తింది. పూజా సామగ్రి కోసం, పత్రి కోసం భక్తులు పడుతున్న ఇబ్బందే, ఆయనను ఈ దిశగా అడుగులు వేసేలా చేసింది. చివరకు 'ఆరాధ్య' పేరుతో సంస్థను ప్రారంభించి... భక్తులకు అవసరమైన అన్నింటినీ ఒకే కిట్ ద్వారా అందించేందుకు ప్రేరేపించింది. వినాయకుడి తోపాటు,  ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఎకో ఫ్రెండ్లీ అయివుండటం గమనార్హం.