Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నయనతారకు రికార్డు పారితోషికం 
  • బాలకృష్ణ, బోయపాటి సినిమా అప్ డేట్ 
  • మూడు రకాల పాత్రల్లో కాజల్

*  కథానాయిక నయనతార తాజాగా విజయ్ హీరోగా నటించే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ఈ చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మకు రికార్డు స్థాయిలో ఐదు కోట్లు చెల్లిస్తున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
 *  ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న నందమూరి బాలకృష్ణ దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నారు. నవంబర్ నుంచి సెట్స్ కు వెళ్లే ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తారు.
*  అందాల నాయిక కాజల్ అగర్వాల్ తాజాగా హిందీలో 'ముంబై సాగా' అనే చిత్రాన్ని చేయడానికి అంగీకరించింది. జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటించే ఈ చిత్రంలో కాజల్ మూడు రకాల పాత్రల్లో కనిపిస్తుందట. వాటిలో ఒక పాత్ర 17 ఏళ్ల అమ్మాయి పాత్ర కావడం విశేషం!

More Telugu News