PMO: తీవ్ర సంక్షోభంలో పాకిస్థాన్.. బకాయిలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రధాని కార్యాలయం

  • రూ. 41 లక్షల బిల్లు కట్టాల్సిన పాక్ ప్రధాని కార్యాలయం
  • బకాయిలు వెంటనే చెల్లించాలని నోటీసిచ్చిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్
  • లేని పక్షంలో కరెంట్ కట్ చేస్తామని హెచ్చరిక

భారత్ తో యుద్ధానికి సైతం సిద్ధమని ఓవైపు బీరాలు పలుకుతున్న పాకిస్థాన్... మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎంతగా అంటే... చివరకు పాక్ ప్రధాని కార్యాలయం కరెంటు బకాయిలు కూడా చెల్లించలేనంతగా. కొన్ని నెలలుగా విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రధాని కార్యాలయానికి కరెంట్ కట్ చేస్తామని సంబంధిత శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ఇప్పటి వరకు పాక్ కరెన్సీలో రూ. 41 లక్షల బకాయిలు పేరుకుపోయాయట. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ... తాజాగా నిన్న మరోసారి నోటీసు జారీ చేసింది. బకాయిలు వెంటనే చెల్లించాలని... లేని పక్షంలో కరెంట్ సరఫరా నిలిపి వేస్తామని నోటీసులో హెచ్చరించింది.

More Telugu News