amaravathi: రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించేది రాజధాని...అటువంటి అంశంపై సీఎం మౌనవ్రతమా?: గంటా శ్రీనివాసరావు

  • సీఎం జగన్‌ తీరు ప్రమాదకరం
  • ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఆయనదే
  • మంత్రులు ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు

ఏ రాష్ట్రానికైనా దశ, దిశ నిర్దేశించేది రాజధాని అని, నవ్యాంధ్ర వంటి కొత్త రాష్ట్రానికి ఈ అంశం మరింత ముఖ్యమని, అంతటి ప్రాధాన్యం ఉన్న అంశంపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మౌనవ్రతం పాటించడం ప్రమాదకరమని మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

రాజధాని అంశంపై మంత్రులు, అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతుండడంతో ప్రజల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందని, కానీ ఆయన మౌనంగా తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. అమరావతిలో అవినీతి జరిగిందని భావిస్తే ప్రభుత్వం విచారణ జరిపించుకోవచ్చని, కానీ సందిగ్ధానికి తెరలేపడం సరికాదన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని ఆయన కోరారు.

More Telugu News