visakhapatnam: ఆనందమైనా, బాధయినా మాతృభాషలో వ్యక్తీకరించినప్పుడే పరిపూర్ణంగా ఉంటుంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • భాషను కాపాడుకుంటే సమాజాన్ని కాపాడుకోవచ్చు
  • మాతృభాషకు ఇటీవల కొందరు దూరమవుతున్నారు
  • సొంత భాషను ప్రేమించడమంటే ఇతర భాషలు వద్దని కాదు

ఆనందమైనా, బాధనైనా సొంత భాషలో వ్యక్తీకరించినప్పుడే పరిపూర్ణంగా ఉంటుందని, అంతటి అందమైన అమ్మ భాషకు ఇప్పుడు కొందరు దూరమవుతున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా గంభీరంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. మాతృ భాషా దినోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అమ్మ భాషను ప్రేమించడమంటే మిగిలిన భాషలను వదిలేయమని కాదన్నారు. భాషను కాపాడుకోవడం అంటే సొంత సమాజాన్ని కాపాడుకోవడమని గుర్తించాలన్నారు.

ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే జరిగేలా చూడాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా కృషి జరగాలన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా సభ్యులు 22 భాషల్లో మాట్లాడుకునే అవకాశాన్ని తాను కల్పించినట్లు చెప్పారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని అన్ని వర్గాలకు అందాలని, దేశం సాంకేతికతంగా అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.

More Telugu News