Balakrishna: థాయ్ ల్యాండ్ లో షూటింగు పూర్తిచేసుకున్న బాలకృష్ణ మూవీ

  • షూటింగు దశలో బాలకృష్ణ 105వ సినిమా
  • ముఖ్య పాత్రల్లో ప్రకాశ్ రాజ్ - భూమిక 
  • సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన  

బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 105వ సినిమా. 'రూలర్' అనే టైటిల్ పరిశీలనలో వుంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఇటీవలే థాయ్ ల్యాండ్ లో ప్లాన్ చేసిన షెడ్యూల్ ను పూర్తి చేశారు. బాలకృష్ణ తదితరులపై అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆయనను ఇంత హ్యాండ్సమ్ గా చూడలేదని అంటున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ - వేదిక నటిస్తున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. భూమిక ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

More Telugu News