Devnani: 'మదరిండియా' రెస్టారెంట్ లో 'ఆర్టికల్ 370', 'ఆర్టికల్ 35ఏ' పేర్లతో బీర్లు

  • 40 ఏళ్ల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ దేవ్నానీ
  • సేల్స్ మెన్ గా పని చేసి రెస్టారెంట్ ను స్థాపించిన ఎన్నారై
  • ఇండియన్ పాస్ పోర్టును ఇప్పటికీ గుర్తుగా ఉంచుకున్న వైనం

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అందులో అంతర్భాగమైన ఆర్టికల్ 35ఏ కూడా రద్దైపోయింది. ఈ కీలక పరిణామం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ లో రెస్టారెంట్ ను నిర్వహిస్తున్న మైక్ దేవ్నాన్ని తన దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు.

 మదరిండియా పేరుతో ఉన్న తన రెస్టారెంటులో రెండు బీర్లకు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A అనే పేర్లను పెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరానికి చెందిన దేవ్నానీ 40 ఏళ్ల క్రితం ఫిలిప్పీన్స్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలుత ఒక గార్మెంట్ షాప్ లో సేల్స్ మెన్ ఉద్యోగం చేసిన ఆయన... ఆర్థికంగా కొంత స్థిరపడిన తర్వాత రెస్టారెంట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా దేవ్నానీ మాట్లాడుతూ ప్రచారం కోసమో, వివాదం కోసమో తాను ఈ పేర్లు పెట్టలేదని చెప్పారు. బీర్లపై ఉన్న పేర్లను చూడగానే కస్టమర్లు వాటి గురించి అడుగుతారని... అప్పుడు మన దేశ ఔన్నత్యం గురించి వారికి వివరించవచ్చని తెలిపారు.

20 ఏళ్ల వయసులో ఫిలిప్పీన్స్ కు వెళ్లిన దేవ్నానీ... అప్పటి నుంచి భారత్ కు తిరిగి రాలేదు. ఇండియన్ పాస్ పోర్టును గుర్తుగా ఇప్పటికీ తన వద్దే ఉంచుకున్నారు. భారత్ లో తనకు బంధువులు ఎవరూ లేరని... అందుకే ఇండియాకు రావాల్సిన అవసరం తనకు రాలేదని చెప్పారు.

More Telugu News