LV Subrahmanyam: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన జెరూసలేం మత్తయ్య

  • తిరుపతి, తిరుమల, శ్రీశైలం ఆలయాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు
  • వారి ఇళ్లకు వెళ్లి అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు
  • ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై మానవ హక్కుల కమిషన్ కు క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య ఫిర్యాదు చేశారు. తిరుపతి, తిరుమల, శ్రీశైలం ఆలయాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్నవారిని సస్పెండ్ చేయడమేకాక, వారి ఇళ్లకు వెళ్లి వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.

అనంతరం మీడియాతో మత్తయ్య మాట్లాడుతూ, ఏపీలోని ఆలయాల్లో పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగించాలంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. హిందువులుగా ఉన్న మీరు క్రైస్తవులుగా ఎందుకు మారారని వారి ఇళ్లకు వెళ్లి అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని, ఆయా ఆలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News