Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కాజల్ తాజా హిందీ చిత్రం 
  • రవితేజ తదుపరి సినిమా 
  • నితిన్ 'భీష్మ' రిలీజ్ డేట్ 

*  అందాలతార కాజల్ అగర్వాల్ తాజాగా హిందీలో ఓ భారీ చిత్రాన్ని అందుకుంది. జాన్ అబ్రహాం హీరోగా సంజయ్ గుప్తా దర్శకత్వం వహించే గ్యాంగ్ స్టర్ కథా చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి కాజల్ ఓకే చెప్పింది.
*  ప్రస్తుతం 'డిస్కో రాజా' చిత్రంలో నటిస్తున్న రవితేజ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
*  వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న 'భీష్మ' చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

More Telugu News