TTD: టీటీడీలో నగల మాయంపై భారీ ఉద్యమాన్ని చేపడతామని బీజేపీ హెచ్చరిక

  • నగలు మాయమైన వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
  • విజిలెన్స్ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయలేదు?
  • ఎవరినో కాపాడేందుకు టీటీడీ పెద్దలు యత్నిస్తున్నారు

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీ నుంచి శ్రీవారి 5 కేజీల బరువున్న వెండి కిరీటం, బంగారు ఉంగరాలు మాయమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ నేతలు చిత్తూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేశారు. నగల మాయంపై దర్యాప్తు జరిపించాలని కోరారు. అనంతరం బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నగలు మాయమైన వెంటనే పోలీసులకు టీటీడీ అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయకపోవడం వెనకున్న మతలబు ఏమిటని అన్నారు. అసలు దోషులను వదిలేసి, అమాయక ఉద్యోగులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎవరినో కాపాడేందుకు టీటీడీ పెద్దలు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు నిందితులను పట్టుకోకపోతే భారీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

More Telugu News