ఎరువులు, రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. విస్తరిస్తున్న మంటలు

28-08-2019 Wed 09:30
  • చర్లపల్లిలోని పారిశ్రామిక వాడలో ఘటన
  • ఒక ఫ్యాక్టరీ నుంచి మరోదానికి విస్తరించిన మంటలు
  • పరిస్థితి అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాదు శివారు చర్లపల్లిలోని పారిశ్రామికవాడలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మేడ్చల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఈ వాడలో ఉన్న ఓ ఎరువులు, రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తొలుత ఓ ఫ్యాక్టరీలో ప్రారంభమైన మంటలు కాసేపటికి మరో ఫ్యాక్టరీకి విస్తరించాయి. నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకుని విస్తరించడంతో స్థానికులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు, సిబ్బంది ఐదు వాహనాలతో ఘటానా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. నష్టం 50 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని ప్రాథమికంగా అంచనా.