Russia: ఎట్టకేలకు స్పేస్ సెంటర్‌ను చేరిన రష్యా హ్యూమనాయిడ్ రోబో

  • పది రోజుల మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి
  • ఫెడర్‌ను మోసుకెళ్లిన సోయజ్ అంతరిక్ష నౌక
  • రెండో ప్రయత్నంలో ఐఎస్ఎస్‌తో అనుసంధానం

రష్యా హ్యుమనాయిడ్ రోబో ఫెడర్ (ఫైనల్ ఎక్స్‌పెరిమెంటల్ డెమోన్‌స్ట్రేషన్ ఆబ్జెక్ట్ రీసెర్చ్) ఎట్టకేలకు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌తో అనుసంధానమైంది. ఫెడర్‌ను మోసుకెళ్లిన రష్యా సోయజ్ అంతరిక్ష నౌక దానిని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు అనుసంధానించడంలో తొలుత విఫలమైంది. గత శనివారం దీనిని ఐఎస్ఎస్‌కు చేర్చేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో స్పేస్ స్టేషన్‌కు 96 మీటర్ల దూరంలో ఉండిపోయింది. మంగళవారం ఉదయం మరోమారు రోబోను ఐఎస్ఎస్‌తో డాకింగ్ చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.

ఫెడర్‌ను మోసుకెళ్లిన సోయజ్ ఎంఎస్-14 అంతరిక్ష నౌక రెండో ప్రయత్నంలో దానిని విజయవంతంగా అనుసంధానించింది. పది రోజుల మిషన్‌లో భాగంగా ఈ రోబోను అంతరిక్షంలోకి పంపారు. రష్యా తొలిసారి స్కైబోట్ ఎఫ్-850 అనే హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపింది. రోబోనాట్- 2 అనే హ్యూమనాయిడ్ రోబోను 2011లో నాసా అంతరిక్షంలోకి పంపింది. ఇప్పుడు రష్యా మరోసారి మనిషంత పరిమాణంలో ఉన్న హ్యూమనాయిడ్ రోబో ఫెడర్‌ను పంపింది.

More Telugu News