Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నయనతార అంటే ఇష్టమంటున్న ప్రభాస్ 
  • 'సైరా' వేడుకకు సూపర్ స్టార్లు 
  • దీపావళికి వస్తున్న కార్తి 'ఖైదీ' 

*  ప్రస్తుతం తమిళ కథానాయికలలో తనకు నయనతార అంటే ఇష్టమని అంటున్నాడు హీరో ప్రభాస్. 'సాహో' తమిళ వెర్షన్ ప్రమోషన్ లో పాల్గొన్నప్పుడు అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా ఈ విషయాన్ని చెప్పాడు. తను తెరపై కనిపించే తీరు, ఆమె అభినయం తనకు నచ్చుతాయని అన్నాడు.
 *  చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా' ముందస్తు విడుదల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో త్వరలో హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంటును భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ నాటి వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని సమాచారం.
 *  తమిళ కథానాయకుడు కార్తి నటిస్తున్న 'ఖైదీ' చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 26 న విడుదల చేస్తారు.

More Telugu News