Asha Workers: ఆశా వర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్ ఉండదు... పెంచిన జీతాలు సెప్టెంబరు నుంచి ఇస్తాం: మంత్రి ఆళ్ల నాని

  • ఆశా వర్కర్లకు రూ.10 వేలు పూర్తిగా చెల్లిస్తామన్న మంత్రి
  • ఆశా వర్కర్ల బకాయిలు చెల్లించాలని సీఎం ఆదేశించారని వెల్లడి
  • విపక్షం ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ మండిపాటు

రాష్ట్రంలో కొన్నివారాలుగా ఆశా వర్కర్లు తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమ జీతం బకాయిలు చెల్లించాలంటూ విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఆందోళన ఫలితాన్నిచ్చినట్టే కనిపిస్తోంది. తాజాగా, ఆశా వర్కర్ల విషయమై ఏపీ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు పెంచిన జీతాలను సెప్టెంబరు నుంచి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఆశా వర్కర్లకు పూర్తిగా రూ.10 వేలు వేతనంగా ఇస్తామని చెప్పారు.  అంతేగాకుండా, ఆశా వర్కర్లు ఆందోళన పడుతున్నట్టుగా వారికి ఎలాంటి గ్రేడింగ్ ఉండదని, పాయింట్ల వ్యవస్థ తీసుకురావడంలేదని హామీ ఇచ్చారు.

ఆశా వర్కర్ల పాత బకాయిలు చెల్లించాలని సీఎం ఆదేశించారని, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆశా వర్కర్ల హామీలను అమల్లోకి తీసుకువచ్చాని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేయని పనిని సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని వివరించారు. అది చూసి ఓర్వలేక విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

More Telugu News