Jagan: జనం మెలకువతో ఉంటే "ఏంటీ దరిద్రపు పాలన?" అని ప్రశ్నిస్తారని ఈ స్కెచ్ వేశారా?: జగన్ పై లోకేశ్ వ్యాఖ్యలు

  • ఏపీ సీఎంపై లోకేశ్ విమర్శలు
  • మద్యం ఆదాయం పెరిగిందంటూ కథనాలు
  • సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి మద్యం రాబడిని పెంచుకోవడం ఏంటని నిలదీసిన లోకేశ్
  • జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడడం మానుకోవాలంటూ హితవు

ఏపీ సీఎం జగన్ పరిపాలన తీరుతెన్నులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మిగతా రంగాలతో పోలిస్తే మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తోందంటూ మీడియాలో కథనాలు రావడం పట్ల లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇకపై జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడడం మానుకోవాలని అన్నారు.

సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి ఈ విధంగా మద్యం రాబడిని పెంచుకోవడం ఏంటని నిలదీశారు. గతేడాదితో పోలిస్తే, ఏప్రిల్ నుంచి జూలై వరకు మద్యంపై ఆదాయంలో 14.5 శాతం పెరుగుదల నమోదైందని, ఏ రంగంలోనూ ఆదాయం రాబట్టలేని ఏపీ సర్కారు మద్యం అమ్మకాల్లో మాత్రం పురోగతి సాధించిందని వ్యంగ్యం ప్రదర్శించారు. జనం మెలకువతో ఉంటే తన పాలనలోని డొల్లతనం బయటపడుతుందని ఈ స్కెచ్ వేశారా ఏంటి? అంటూ లోకేశ్ తనదైన శైలిలో విమర్శించారు.

More Telugu News