Rahul Gandhi: ఆర్బీఐ డబ్బులు దొంగిలించినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు: రాహుల్ గాంధీ

  • ఆర్థిక సంక్షోభాన్ని గాడిలో పెట్టలేరు
  • మోదీకి, నిర్మలకు సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు
  • తుపాకీ గాయానికి బ్యాండ్ ఎయిడ్ వేసినట్టు వీరి చర్యలు ఉన్నాయి

కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్లను బదిలీ చేస్తామంటూ ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నుంచి డబ్బులు దొంగిలించినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదని... ఆర్థిక సంక్షోభాన్ని గాడిలో పెట్టలేరని విమర్శించారు. ఆర్థిక సంక్షోభానికి కారణమైన  ప్రధాని, ఆర్థిక మంత్రిలకు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదని అన్నారు. రిజర్వ్ బ్యాంకును కొల్లగొట్టినంత మాత్రాన సమస్యను పరిష్కరించలేరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చర్య... తుపాకీ గాయానికి బ్యాండ్ ఎయిడ్ వేయడం వంటిదని ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు. అంతే కాదు 'ఆర్బీఐ లూటెడ్' అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.

More Telugu News