Prabhas: యూఎస్ లో 'సాహో' భారీ రిలీజ్

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'సాహో'
  • దగ్గర పడుతోన్న విడుదల తేదీ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి 

ప్రభాస్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'సాహో' ఈ నెల 30వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. యూఎస్ఏ లో ఈ సినిమా తెలుగు వెర్షన్ ను ఈ నెల 29వ తేదీన 250 లొకేషన్స్ లో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ .. విదేశాల్లోని ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డుస్థాయిలో ఉండొచ్చుననే ఊహాగానాలు మొదలైపోయాయి. ప్రభాస్ ఖాతాలో మరో సంచలన విజయం వచ్చి చేరినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ధాటికి తట్టుకోలేమని భావించి చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. అందరి అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకోగలుతుందో చూడాలి.

More Telugu News