Jagan: కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ

  • ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయన్న షెకావత్
  • జగన్ తో పోలవరంకు సంబంధించి అన్ని విషయాలపై చర్చించామన్న కేంద్ర మంత్రి
  • అన్నీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలో తీరిక లేకుండా వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. నక్సలిజంపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన, ఆపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలోనే కలిశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే భేటీ ముగిసింది. అనంతరం షెకావత్ మాట్లాడుతూ, ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. సమావేశం సందర్భంగా పోలవరం ప్రాజక్టుకు సంబంధించి అన్ని విషయాలపై చర్చించామని తెలిపారు. పీపీఏ నివేదికను విస్తృత ప్రయోజనాల కోణంలో పరిశీలిస్తామని, అన్నింటిని పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

More Telugu News