Nani: 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • వినోదభరిత చిత్రంగా 'గ్యాంగ్ లీడర్'
  • కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పరిచయం 
  • సెప్టెంబర్ 13వ తేదీన విడుదల

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్' రూపొందింది. పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమా ద్వారా ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ట్రైలర్ ను వదలడానికి టీమ్ రెడీ అవుతోంది.

ఈ నెల 28వ తేదీన .. ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన విడుదలయ్యే 'సాహో' సినిమాతో పాటు ఈ ట్రైలర్ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రతినాయకుడిగా హీరో కార్తికేయ నటించిన ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రను లక్ష్మి పోషించారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాపై నాని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఆయనకి హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News