Tora: 10 వేలకు పైగా క్యాబ్స్ తో నేటి నుంచి 'టోరా' సేవలు... జీరో సర్జ్ స్పెషల్!

  • రూ. 45 బేస్ ఫేర్ పై 3 కిలోమీటర్ల ప్రయాణం
  • డ్రైవర్ల నుంచి కమీషన్ వసూలు చేయబోము
  • టోరా క్యాబ్స్ సీఈఓ శ్రీనివాస్ కృష్ణ

హైదరాబాద్ లో మరో క్యాబ్ సంస్థ నేటి నుంచి తన సేవలను ప్రారంభించనుంది. 10 వేలకు పైగా కార్లను ఒకేసారి రోడ్లపైకి తెస్తున్నామని టోరా క్యాబ్స్ సీఈవో (టెక్నాలజీ సర్వీసెస్‌ విభాగం) శ్రీనివాస్‌ కృష్ణ తెలిపారు. మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కవితా భాస్కరన్‌ తో కలిసి టోరా యాప్‌ ను ఆవిష్కరించిన ఆయన, తాము కిలోమీటరుకు కనీస చార్జీగా రూ. 10 వసూలు చేయనున్నామని, ఇప్పుడున్న క్యాబ్ సంస్థలు డిమాండ్ ను బట్టి సర్జ్ చార్జ్ ని వసూలు చేస్తున్నాయని, తాము మాత్రం అటువంటి చార్జీలను వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

డ్రైవర్ల నుంచి కమీషన్‌ వసూలు చేయరాదని నిర్ణయించామని, వారు తమకు రోజుకు రూ.199 చందా చెల్లిస్తే చాలని శ్రీనివాస్ కృష్ణ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సేవలను ప్రారంభించిన టోరా, సమీప భవిష్యత్తులో ఇతర నగరాలకు కూడా విస్తరిస్తుందని తెలిపారు. ట్రావెల్‌ టైమ్‌ చార్జీ కిలోమీటరుకు రూ. 1.52 అదనమని, రూ. 45 బేస్‌ ఫేర్‌ పై 3 కిలోమీటర్లు ప్రయాణించ వచ్చని శ్రీనివాస్ కృష్ణ వెల్లడించారు.

More Telugu News