Sahoo: అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ లోనూ 'సాహో'!

  • 30న విడుదల కానున్న 'సాహో'
  • తొలి వారాంతానికి బుకింగ్స్ దాదాపు పూర్తి!
  • భారీ ఓపెనింగ్స్ ఖాయమంటున్న ట్రేడ్ విశ్లేషకులు

ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ విషయంలో దూసుకెళుతోంది. బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం సినిమాలు విడుదలయ్యే సమయంలో కనిపించే హడావుడి 'సాహో' హిందీ వర్షన్ కు కనిపిస్తోంది. బుక్ మై షోలో ఈ చిత్రానికి మూడున్నర లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. భారత సినీ ఇండస్ట్రీలో భారీ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రం, 30న విడుదలకానుంది.

ఇక ఈ చిత్రం తొలిరోజు బుకింగ్స్ అప్పుడే పూర్తికాగా, వారాంతం బుకింగ్స్ నేటితో ముగుస్తాయని సినీ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఆపై వినాయక చవితి సెలవు కూడా ఉండటంతో నాలుగైదు రోజులపాటు సినిమా ఫుల్ స్వింగ్ లో ఉంటుందని అంచనా. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయమని అంచనా వేస్తున్న ట్రేడ్ పండితులు, తొలి రోజు పాజిటివ్ టాక్ వస్తే, ఈ చిత్రం ఎన్నో రికార్డులను బద్దలు కొడుతుందని అంటున్నారు.

More Telugu News