Shilpa Shindey: నేను పాకిస్థాన్ వెళ్లకుండా ఆపగలరా? మీకా దమ్ముందా?: సవాల్ విసిరిన నటి శిల్పా షిండే

  • పాక్ లో మికా సింగ్ ప్రదర్శనపై సినీ సంఘాల ఆగ్రహం
  • సినీ సంఘాల తీరును తప్పుబట్టిన శిల్పా షిండే
  • సినీ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలంటూ హితవు

ఇటీవల భారత్ కు చెందిన ప్రముఖ గాయకుడు మికా సింగ్ పాకిస్థాన్ లో ప్రదర్శన ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో మికా వంటి గాయకుడు పాక్ వెళ్లడంపై కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే బుల్లితెర నటి శిల్పా షిండే ఈ విషయంలో మికా పక్షాన నిలిచింది. మికాకు ప్రభుత్వమే వీసా ఇచ్చినప్పుడు మధ్యలో సినీ సంఘాలకు వచ్చిన ఇబ్బంది ఏంటని శిల్పా ప్రశ్నించింది. మికా వంటి గాయకుడి ప్రతిభ పట్ల గర్వించాలని సూచించింది.

సినీ సంఘాలు అనేక సమస్యలను వదిలిపెట్టి మికా వ్యవహారంపై దృష్టిపెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. షూటింగ్ ల సందర్భంగా కార్మికులు నిత్యం 12 నుంచి 15 గంటల వరకు పనిచేస్తున్నారని, వారికి 8 గంటల పనివేళలను నిర్ధారించడంపై శ్రద్ధ చూపాలని హితవు పలికింది. దేశంపై ప్రేమ ఉంటే ఆర్మీలో చేరాలని, తాను పాకిస్థాన్ వెళ్లాలనుకుంటే ఆపే దమ్మెవరికైనా ఉందా అంటూ ప్రశ్నించింది.

More Telugu News