Andhra Pradesh: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. ఇద్దరు నిందితులకు ‘నార్కో’ పరీక్షలు పూర్తి!

  • మిగిలిన ఇద్దరు నిందితులకు త్వరలోనే
  • నివేదికను కోర్టుకు సమర్పించనున్న పోలీసులు
  • ఈ ఏడాది మార్చి 15న హత్యకు గురైన వివేకా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తయ్యాయి. వాచ్ మెన్ రంగయ్య, వివేకా అనుచరుడు గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తుతెలియని దుండగులు జమ్మలమడుగులోని ఇంట్లో కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మన్‌ రంగయ్య, కసనూరు పరమేశ్వర్‌రెడ్డి, దిద్దెకుంట శేఖర్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరిని పులివెందుల కోర్టు అనుమతితో గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న ల్యాబ్ కు తీసుకెళ్లారు. అక్కడే రంగయ్య, గంగిరెడ్డిలకు నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తిచేశారు. పరమేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డిలకు కూడా త్వరలోనే నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తిచేసి మొత్తం నివేదికను పోలీసులు కోర్టు ముందు ఉంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నివేదికలో ఏముందన్న విషయమై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.

More Telugu News