ప్రధాని మోదీకి మరో గౌరవం.. ‘కింగ్ హమద్’ అవార్డును బహూకరించిన బహ్రెయిన్!

- బహ్రెయిన్ రాజుతో మోదీ భేటీ
- పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
- అంతరిక్షం, సోలార్, సాంస్కృతిక రంగంలో ఒప్పందాలు
ఈ అవార్డును అందుకున్న అనంతరం ప్రధాని స్పందిస్తూ..‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైసెన్స్ అవార్డును నేను వినమ్రంగా స్వీకరిస్తున్నా. భారత్-బహ్రెయిన్ ల మధ్య ఎంత బలమైన స్నేహం ఉందో చెప్పేందుకు ఈ అవార్డే నిదర్శనం. బహ్రెయిన్ తో భారత్ కు వందలాది సంవత్సరాల నుంచే సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఈ సంబంధాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. బహ్రెయిన్ లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.