Andhra Pradesh: ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల!

  • వచ్చే నెల 1 నుంచి 8 వరకూ పరీక్షలు
  • 1.60 లక్షల ఖాళీల భర్తీ
  • పరీక్ష ముగిసిన రోజే ప్రాథమిక కీ విడుదల

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లాలా ఏపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాదాపు 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను gramasachivalayam.ap.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ పరీక్షలు వచ్చే నెల 1 నుంచి 8వ తేదీ మధ్య జరుగుతాయి. పరీక్ష ముగిసిన వెంటనే ప్రాథమిక కీని విడుదల చేస్తారు.

More Telugu News