CBSE: ఒక్కో విద్యార్థి రోజుకు లీటర్ నీటిని ఆదా చేయాలి: స్కూళ్లకు సీబీఎస్‌ఈ ఆదేశాలు

  • ‘జల్‌శక్తి అభియాన్’లో భాగంగా సీబీఎస్‌ఈ ఉత్తర్వులు
  • ఇంట్లోను, స్కూళ్లలోనూ నీటిని ఆదాచేసేలా చూడాలని ఆదేశం
  • స్కూళ్లలో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచన

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో చదువుతున్న ఒక్కో విద్యార్థి రోజుకు కనీసం ఒక లీటర్ నీటిని పొదుపు చేసేలా చూడాలని అన్ని స్కూళ్లకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు తమ ఇళ్లు, స్కూల్‌లో నీటిని ఆదా చేసేలా చూడాలని పేర్కొంది. ‘జల్‌శక్తి అభియాన్’లో భాగంగా సీబీఎస్‌ఈ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, స్కూళ్లలో ఎకో క్లబ్‌ను ఏర్పాటు చేయడం, ఉన్నవాటిని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించింది.  

ఎకో క్లబ్‌ల వల్ల వాతావరణ, పర్యావరణ అక్షరాస్యత పెరుగుతుందని సీబీఎస్‌ఈ చైర్ పర్సన్ అనితా కర్వాల్ పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ స్కూళ్లు దీనిని ఓ ఎజెండాలా తీసుకుని అమలు చేయాలని పేర్కొన్నారు. 5-12వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కూలు, ఇంటిలో ప్రతి రోజూ ఒక లీటర్ నీటిని ఆదా చేయగలిగితే వచ్చే మూడేళ్లలో అనుబంధ పాఠశాలలు నీటి సామర్థ్య పాఠశాలలుగా మారుతాయని అనిత పేర్కొన్నారు.

More Telugu News