New Delhi: సెల్ ఫోన్ ను మింగేసిన ఖైదీ... రింగ్ టోన్ విని పోలీసుల అవాక్కు!

  • న్యూఢిల్లీలోని తీహార్ జైల్లో ఘటన
  • ఫోన్ ను మింగేసిన ఖైదీ
  • బయటకు తీయించిన అధికారులు

ఎక్కడి నుంచో సెల్ ఫోన్ మోగుతోంది. తమ వద్ద ఉన్న ఫోన్లేవీ మోగడం లేదు. ఈ శబ్ధం ఎక్కడి నుంచి వస్తోంది చెప్మా?... అని ఆలోచించి పరీక్షగా చూసిన పోలీసులు, అది తమ పక్కనే ఉన్న ఖైదీ కడుపులోంచి వినిపిస్తోందని తెలుసుకుని అవాక్కయ్యారు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత, తిరిగి జైలుకు తీసుకు వస్తున్న వేళ పోలీసులకు ఫోన్ రింగ్ వినిపించింది. అది ఎక్కడి నుంచి వస్తున్నదనేది తొలుత అర్థం కాలేదు. ఆ శబ్ధం ఖైదీ వద్ద నుంచి వస్తోందని మాత్రం వారికి అర్థమైంది.

మరింతగా పరిశీలించేసరికి ఆ ఖైదీ కడుపులో నుంచి ఈ రింగ్ టోన్ వినిపిస్తోందని తెలుసుకుని, అతన్ని ప్రశ్నించారు. తాను అతిచిన్న ఫోన్ ను మింగేశానని చెప్పగా ఆశ్చర్యపోయారు. ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లి, ఖైదీ కడుపులో నుంచి ఫోన్ ను బయటకు తీయించారు. తీహార్ జైలులోని నంబర్-4 సెల్ లో అతను ఉంటాడని, గతంలోనూ జైలు లోపలికి ఫోన్ ను తీసుకువస్తూ అతను దొరికిపోయాడని అధికారులు వెల్లడించారు.

More Telugu News