Allu Arjun: ఇదిగో నా 'బీస్ట్'... కొత్త కారుతో చిరునవ్వులు చిందిస్తున్న అల్లు అర్జున్

  • రేంజ్ రోవర్ కొనుగోలు చేసిన బన్నీ
  • కొత్తకారుతో ఫొటోలకు పోజులు
  • ట్విట్టర్ లో పోస్టు చేసిన స్టయిలిష్ స్టార్

సెలబ్రిటీలు తమ గ్యారేజ్ ఖరీదైన కార్లు, పేరుప్రతిష్ఠలు ఉన్న కార్లతో కళకళలాడిపోవాలని కోరుకుంటారు. టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గ్యారేజ్ లోకి కొత్త వాహనాన్ని తీసుకువచ్చారు. అల్లు అర్జున్ తాజాగా రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారును కొనుగోలు చేశారు. ఫ్రెష్ గా షోరూం నుంచి తెచ్చిన ఈ రోవర్ కారుతో బన్నీ తన గ్యారేజ్ వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. తన కొత్త కారుకు బీస్ట్ అని పేరు పెట్టానని ట్వీట్ చేశారు. తాను ఎప్పుడు కొత్త వస్తువు కొన్నా, 'విశ్వసనీయత' అనే ఒకే ఒక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటానని వెల్లడించారు.

More Telugu News