Kohli: టెండూల్కర్ సాధించిన ఈ రికార్డును మాత్రం కోహ్లీ బద్దలు కొట్టలేడు: సెహ్వాగ్

  • కోహ్లీ ఒక గొప్ప బ్యాట్స్ మెన్
  • సచిన్ పేరిట ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొడతాడు
  • అత్యధిక టెస్టులు ఆడిన రికార్డును మాత్రం అధిగమించలేడు

మూడు ఫార్మాట్లలో ఇప్పటికే ఎన్నో రికార్డులను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ ఒక గొప్ప బ్యాట్స్ మెన్ అని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కితాబిచ్చాడు. క్రికెట్ దిగ్గజం టెండూల్కర్ సాధించిన ఎన్నో రికార్డులను కూడా కోహ్లీ సొంతం చేసుకుంటాడని... అయితే, ఎక్కువ టెస్టులు ఆడిన క్రికెటర్ గా సచిన్ పేరిట ఉన్న రికార్డును మాత్రం బద్దలు కొట్టలేడని తెలిపాడు. తన కెరీర్లో సచిన్ 200 టెస్టులు ఆడాడు. 168 టెస్టులతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 77 టెస్టులు ఆడాడు.

కోహ్లీ పరుగులు సాధిస్తున్న తీరు, సెంచరీలను కొడుతున్న తీరు అతనొక గొప్ప బ్యాట్స్ మెన్ అని నిరూపిస్తున్నాయని సెహ్వాగ్ అన్నాడు. తన గొప్ప నైపుణ్యంతో సచిన్ కు చెందిన ఎన్నో రికార్డులను కూడా కోహ్లీ అధిగమిస్తాడని తెలిపాడు. కానీ, అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీనే కాదు, మరే ఇతర ఆటగాడు కూడా బద్దలు కొట్టలేడని చెప్పాడు.

More Telugu News