Kejriwal: ఆర్థిక సంక్షోభం నుంచి మోదీ ప్రభుత్వం గట్టెక్కిస్తుందనే నమ్మకం నాకు ఉంది: కేజ్రీవాల్

  • సరైన నిర్ణయాలు, చర్యలతో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుంది
  • కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సహకరిస్తాం
  • ఉద్యోగాలు కోల్పోయే వారి గురించే ఆందోళన చెందుతున్నా

ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందనే వార్తలు భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సరైన నిర్ణయాలు, చర్యలతో ఆర్థిక సంక్షోభం నుంచి కేంద్ర ప్రభుత్వం గట్టెక్కిస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. యావత్ దేశం ఒకతాటిపై నిలిచి, ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడానికి ఇది సరైన సందర్భమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.

అయితే, ఉద్యోగాలు కోల్పోయే వారి గురించే తాను ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఆటోమొబైల్స్, టెక్స్ టైల్స్, రియలెస్టేట్ తదితర రంగాలు ఆర్థిక సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమవుతాయని చెప్పారు. ఈ రంగాలపై మరింత దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

More Telugu News