tripul thalak: 'ట్రిపుల్‌ తలాఖ్' అంశంపై పరిశీలించేందుకు సుప్రీం సుముఖత

  • దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ
  • కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
  • జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ

ట్రిపుల్‌ తలాఖ్ ను నేరంగా పరిగణిస్తూ కేంద్రం చేసిన చట్టాన్ని పునఃపరిశీలించాలన్న పిటిషనర్‌ విన్నపాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మన్నించింది. ఇది ఎంతవరకు చెల్లుబాటుకు అర్హమైనదో పరిశీలిస్తామని పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌కు తెలిపింది. చట్టానికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

ముమ్మారు తలాఖ్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లోనే తీర్పు ఇచ్చినా, అది కొనసాగుతుండడం అన్యాయమని భావించిన ఎన్డీయే ప్రభుత్వం ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం 2019లో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తలాఖ్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణించే అంశాన్ని న్యాయస్థానం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

More Telugu News