Vizag: విశాఖ సహా ఆరు విమానాశ్రయాల్లో... ఎయిర్ ఇండియాకు ఇంధనం బంద్!

  • బకాయిలు చెల్లించడంలో విఫలం
  • ఏటీఎఫ్ సరఫరా నిలిపివేత
  • సర్వీసులకు అవాంతరాలు కలుగలేదన్న ఏఐ

ఇంధన బకాయిలను చెల్లించడంలో విఫలమైన ఎయిర్ ఇండియాకు దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల్లో నిన్న సాయంత్రం నుంచి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ సరఫరాను నిలిపి వేసినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వెల్లడించాయి. విశాఖపట్టణం, కొచ్చిన్, మోహాలీ, రాంచి, పుణే, పాట్నా ఎయిర్ పోర్టుల్లో ఏఐ విమానాలకు ఇంధనాన్ని ఆపేశామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పెండింగ్ బకాయిల మొత్తం భారీగా పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

కాగా, ఇంధన నిలిపివేతపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందిస్తూ, ఈ కారణంతో తమ సర్వీసులకు ఎటువంటి అవాంతరాలు ఎదురు కాలేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ పనితీరు మెరుగుపడిందని, నిర్వహణ లాభం సాధించే దిశగా వెళుతున్నామని అన్నారు. సంస్థ వాటాల విక్రయం ద్వారా నిధులు లభించకుంటే, రుణ భారాన్ని తగ్గించుకునే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.

More Telugu News