Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సూర్య సరసన కాజల్  కు ఛాన్స్ 
  • తమిళ దర్శకుడితో మెగా హీరో 
  • పూరి 'ఫైటర్'గా విజయ్ దేవరకొండ  

*  చాలా రోజుల తర్వాత కథానాయిక కాజల్ మళ్లీ తమిళ నటుడు సూర్య సరసన నటించనుంది. సూర్య నటించే 39వ చిత్రం కోసం కాజల్ తో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. దీనికి శివ దర్శకత్వం వహిస్తాడు.
*  మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరం తేజ్ త్వరలో ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సాయిధరం  'ప్రతి రోజు పండగే' చిత్రంలో నటిస్తున్నాడు.
*  'ఇస్మార్ట్ శంకర్'తో మళ్లీ సక్సెస్ కొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ హీరోగా చేయనున్నాడు. నవంబర్ నుంచి షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి 'ఫైటర్' అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

More Telugu News