Pakistan: కశ్మీర్‌లో దాడులకు పాక్ భారీ కుట్ర.. ఆప్ఘాన్ నుంచి వందమంది ఉగ్రవాదులు!

  • కశ్మీర్‌లో కల్లోలానికి పాక్ భారీ కుట్ర
  • భారత్‌లో చొరబాటుకు రెడీగా 15 మంది జైషే ఉగ్రవాదులు
  • భద్రతా దళాలను హెచ్చరించిన నిఘా వర్గాలు

కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో ఉడికిపోతున్న పాక్, లోయలో ఎలాగైనా అల్లకల్లోలం సృష్టించాలని పథక రచన చేస్తోంది. ఇందుకోసం ఉగ్రవాదులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఈ మేరకు నిఘా వర్గాలకు సమాచారం అందింది. కశ్మీర్‌లో దాడుల కోసం ఆఫ్గానిస్థాన్ నుంచి వందమంది కరడుగట్టిన ఉగ్రవాదులను కశ్మీర్‌కు పంపాలని పాకిస్థాన్ యోచిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

నిఘా వర్గాల హెచ్చరికలతో సరిహద్దు వద్ద భద్రతను ఆర్మీ మరింత కట్టుదిట్టం చేసింది. మరోవైపు, నియంత్రణ రేఖకు ఆవల 15 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు మాటువేసి ఉన్నారని, వీరంతా కశ్మీర్‌లో చొరబడేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

More Telugu News