Congress: ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు రాజీవ్ గాంధీ ఎన్నడూ పాల్పడలేదు: సోనియా గాంధీ

  • మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి
  • 1984లో ఫుల్ మెజార్టీతో రాజీవ్ అధికారంలోకి వచ్చారు
  • ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఎన్నడూ హరించలేదు

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ పేర్లను ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ, 1984 లోక్ సభ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చారని గుర్తుచేసుకున్నారు.

అయితే, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించేందుకు, వారిని భయపెట్టేందుకు రాజీవ్ ఎన్నడూ తన అధికారాలను ఉపయోగించలేదని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని అన్నారు. ప్రస్తుతం ఆ విలువలను నాశనం చేయాలని చూస్తున్న వారిని ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పై ఉందని, విభజన శక్తులపై పోరాడతామని చెప్పారు.

More Telugu News