Texas woman: యూట్యూబ్ వీడియో చూస్తూ వజ్రాన్ని పట్టేసింది.. అమెరికాలో యువతి జాక్ పాట్!

  • అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘటన
  • అర్కన్సాస్ డైమండ్ పార్కుకు వెళ్లిన యువతి
  • యూట్యూబ్ వీడియో చూస్తూ వజ్రాల వేట

యూట్యూబ్ వీడియోను చూసి ఓ వజ్రాన్ని దొరకబుచ్చుకుందో మహిళ. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. టెక్సాస్ లోని అర్కన్సాస్ క్రేటర్ ఆఫ్ డైమండ్స్ దొరికే పార్కులో మిరండా(27) అనే యువతి వజ్రాల కోసం వేట ప్రారంభించింది. ఈ పార్కులో వజ్రాలు, విలువైన రాళ్లు దొరికితే దాన్ని తమ వెంట తీసుకెళ్లిపోవచ్చని ఆశతో వుంది. ఈ క్రమంలో మిరండా..యూట్యూబ్ ను తెరిచింది. వజ్రాన్ని ఎలా వెతకాలో తెలిపే వీడియో చూడటం ప్రారంభించింది.

‘నేను నీడలో కూర్చుని వీడియో చూస్తున్నా. ఈ సందర్భంగా అక్కడే ఆడుకుంటున్న నా పిల్లాడివైపు తలెత్తి చూశా. ఆ తర్వాత మొబైల్ ఫోన్ లో వీడియో చూడబోతుండగా, కింద పసుపుపచ్చ రంగులో ఓ రాయి మెరుస్తూ కనిపించింది. దాన్ని బయటకు తీయగానే అది వజ్రమని అర్థమయింది’ అని మిరండా చెప్పింది. ఈ 3.72 క్యారెట్ల వజ్రాన్ని తాను అమ్మబోననీ, డైమండ్ రింగ్ చేయించుకుంటానని యువతి తెలిపింది. కాగా, 2013 తర్వాత ఇంత పెద్ద పసుపుపచ్చ వజ్రం లభించడం ఇదే తొలిసారని డైమండ్ పార్క్ వర్గాలు తెలిపాయి.

More Telugu News