Andhra Pradesh: ఏపీ నూతన రాజధానిగా కర్నూలును ప్రకటించాలి!: వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్

  • శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించాలి
  • రాజకీయ నేతలంతా ఇందుకు కలిసిరావాలి
  • కర్నూలులో మీడియాతో వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందన్న వార్తల నేపథ్యంలో కొత్తకొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. రాజధానిని తిరుపతి చేయాలని లోక్ సభ మాజీ సభ్యుడు చింతా మోహన్ ఇప్పటికే డిమాండ్ చేయగా, తాజాగా ఈ జాబితాలో వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి కూడా చేరారు. చంద్రబాబు కొందరు వ్యక్తుల కోసమే అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నూతన రాజధాని విషయంలో ప్రభుత్వం అన్నిపక్షాలతో చర్చించాలని ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏపీ నూతన రాజధానిగా కర్నూలును ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం నేతలు రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  శ్రీకృష్ణ కమిటీ నివేదికను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News