Madras: మద్రాస్ నగరానికి 380 ఏళ్లు... మంచు మనోజ్ ట్వీట్

  • మద్రాస్ డే పురస్కరించుకుని మంచు మనోజ్ స్పందన
  • మద్రాస్ అంటే ఎంతో ఇష్టమంటూ వ్యాఖ్యలు
  • తన లైఫ్ లో అత్యంత సన్నిహితులను అందించిందంటూ మద్రాస్ కు థ్యాంక్స్ చెప్పిన మనోజ్

దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఓడరేవుగా చెన్నై ఎంతో ఖ్యాతి పొందింది. గతంలో చెన్నై పేరు మద్రాస్ అన్నది తెలిసిందే. ద్రవిడ సంస్కృతికి నెలవుగా మారిన ఈ మద్రాస్ నగరానికి ఇప్పుడు 380 ఏళ్లు. ఈ సందర్భంగా మద్రాస్ డేని పురస్కరించుకుని టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

"నా మద్రాస్ నగరం వయసు 380 ఏళ్లు. ఈ నగరంలో నా బాల్యానికి సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచుకున్నాను. మద్రాస్, నువ్వంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే నా జీవితంలో అత్యంత సన్నిహితులను అందించావు" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ గతంలో మద్రాస్ లో ఉండగా, తెలుగు నటీనటుల కుటుంబాలు కూడా అక్కడే ఉండేవి. మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు సినీ ప్రస్థానం కూడా మద్రాస్ నగరంలోనే మొదలైంది. దాంతో మంచు మనోజ్ బాల్యం చాలావరకు మద్రాస్ నగరంలోనే గడిచింది.

More Telugu News