Congress: కాంగ్రెస్ నేత చిదంబరం అరెస్ట్ పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్
  • ముడుపులు అందుకున్నారని కేసు నమోదు
  • తమకు సంబంధం లేదన్న కిషన్ రెడ్డి

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పొందేందుకు చిదంబరం సహకరించారనీ, ఇందుకు ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారని సీబీఐ, ఈడీ కేసులు నమోదుచేశాయి. ఈ నేపథ్యంలో చిదంబరం అరెస్ట్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

ఈరోజు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘చట్టం తన పని తాను చూసుకుపోతుంది. చిదంబరం విషయంలో కోర్టులు తుది నిర్ణయం తీసుకుంటాయి. చిదంబరం అరెస్ట్ తో కేంద్ర ప్రభుత్వానికీ, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అవినీతిలో మునిగితేలినవారిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించాల్సింది కోర్టులే తప్ప ప్రభుత్వం కాదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

More Telugu News