Donald Trump: ట్రంప్‌ను చూసి మోదీ భయపడుతున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

  • ట్రంప్ అంత మాట అంటున్నా ఎందుకు స్పందించడం లేదు
  • మన విదేశాంగ విధానంలో లోపం ఉంది
  • అందుకే స్పందించేందుకు భయం

కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ట్రంప్ చెబుతున్నా భారత్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ విషయంలో భారత వైఖరి సరికాదన్నారు. ప్రపంచ దేశాలన్నీ కశ్మీర్ విషయాన్ని హిందూ-ముస్లిం సమస్యగానే చూస్తున్నాయన్నారు. ఈ విషయంలో మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇరు దేశాల సమస్యను రెండు వర్గాల సమస్యగా చూడడం సరికాదని హితవు పలికారు.

కశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వానికి రెడీ అయినా భారత ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మన విదేశీ విధానంలో ఏదో లోపం ఉందని, అందుకే స్పందించేందుకు భయపడుతున్నామని అన్నారు. ఈ విషయంలో మన విదేశీ విధానం ఏంటని అసద్ ప్రశ్నించారు.    

More Telugu News