Bikini airline: భారత్‌లో అడుగుపెట్టిన ‘బికినీ’ ఎయిర్‌లైన్స్.. వస్తూనే అదిరిపోయే ఆఫర్!

  • న్యూఢిల్లీ-వియత్నాం మధ్య విమాన సర్వీసులు
  • డిసెంబరు 7 నుంచి మొదలు
  • విమానం నిండా బికినీ పాపలే

వివాదాస్పద వియత్ జెట్ విమానయాన సంస్థ భారత్‌లో అడుగుపెట్టింది. ‘బికినీ ఎయిర్‌లైన్స్’గా పేరుగాంచిన వియత్నాంకు చెందిన ఈ సంస్థ  ఇండియా-వియత్నాం మధ్య ప్రత్యేక సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. డిసెంబరు ఆరో తేదీ నుంచి న్యూఢిల్లీ-హోచిమిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలు నడపనున్నట్టు తెలిపింది. అలాగే, హనోయి-ఢిల్లీ మార్గంలో డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని పేర్కొంది. ఈ సందర్భంగా వియత్ జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్ తన్‌సన్ మాట్లాడుతూ.. వ్యాపార విస్తరణ విషయంలో భారత్ తమకు మొదటి ప్రాధాన్య దేశమని పేర్కొన్నారు.

భారత్‌లోకి అడుగుపెడుతున్నట్టు చెబుతూనే ఈ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘త్రీ గోల్డెన్ డేస్’ పేరుతో స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా 9 రూపాయలకే టికెట్లను విక్రయిస్తోంది. రెండు రోజుల క్రితం ఆఫర్ సేల్ ప్రారంభించగా నేటితో ఆఖరు.

2011లో సేవలు ప్రారంభించిన వియత్‌ జెట్ విమానయాన సంస్థల్లో ప్రత్యేకతను చాటుకుంది. ఆ సంస్థ విమానాల్లోని ఎయిర్‌ హెస్టెస్, సిబ్బంది బికినీల్లో సేవలందిస్తారు. దీంతో ఈ సంస్థకు బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరు స్థిరపడింది.

More Telugu News