Polavram: ‘పోలవరం’ టెండర్లు రద్దు చేయడం సరికాదు: బీజేపీ నేత ఆంజనేయరెడ్డి

  • అవినీతి జరిగిందని భావిస్తే దర్యాప్తు జరిపించాలి
  • అంతేగానీ టెండర్లు రద్దు చేస్తారా?
  • ప్రభుత్వ నిర్ణయాలు గందరగోళం సృష్టిస్తున్నాయి

పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు చేయడం సరికాదని బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం, పోలవరం ప్రాజెక్టు  అథారిటీ (పీపీఏ) సూచనలు, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ టెండర్లు రద్దు చేయడం సబబు కాదని అన్నారు. ఏదైనా అవినీతి జరిగిందని భావిస్తే దర్యాప్తు జరిపించాలే తప్ప టెండర్లు రద్దు చేయడం కరెక్టు కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని, కొన్ని నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ చర్యలను గుర్తుచేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ల గురించి ప్రస్తావిస్తూ, ఆ క్యాంటీన్లు సరిగా లేకుంటే మార్పులు చేయాలే తప్ప మూసివేయడమేంటి? అని ప్రశ్నించారు.

More Telugu News