Salman Khan: 'దబాంగ్ 3' విడుదల తేదీ ఖరారు

  • సల్మాన్ కథానాయకుడిగా 'దబాంగ్ 3'
  • కథానాయికగా సోనాక్షి సిన్హా 
  • ఒకే రోజున నాలుగు భాషల్లో విడుదల

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో 'దబాంగ్ 3' రూపొందుతోంది. సల్మాన్ ఖాన్ .. అర్బాజ్ ఖాన్ .. నిఖిల్ ద్వివేది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

హిందీతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో అదే రోజున విడుదల చేయనున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సుదీప్ .. మహి గిల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో సల్మాన్ చేసిన 'దబాంగ్' .. 'దబాంగ్ 2' సినిమాలు ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి 'దబాంగ్ 3' ఆ రెండు సినిమాలను మించిన వసూళ్లను సాధిస్తుందేమో చూడాలి.

More Telugu News