Kajal: 'క్వీన్' తమిళ రీమేక్ లో కొన్ని సన్నివేశాల కత్తిరింపు పట్ల కాజల్ అసంతృప్తి

  • హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్'
  • దక్షిణాది భాషల్లో రీమేక్ 
  • తమిళ రీమేక్ లో చేసిన కాజల్

కొంతకాలం క్రితం హిందీలో కంగనా రనౌత్ చేసిన 'క్వీన్' సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కంగనా రనౌత్ కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ లో కాజల్ నటించింది. అయితే ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు .. సంభాషణలు ఉండటంతో, సెన్సార్ బోర్డువారు నిరభ్యంతరంగా వాటిని కత్తిరించేశారట.

ఈ విషయం పట్ల నిర్మాతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, మరోసారి పరిశీలించాలని హడావిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాజల్ స్పందిస్తూ .. "ఈ సినిమాను నేను ఎంతో కష్టపడి చేశాను. ఒరిజినల్లో వున్న సన్నివేశాలనే తీయడం జరిగింది. అయినా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కత్తిరించడం నన్ను చాలా అసంతృప్తికి గురిచేసింది. ఇలా జరగకుండా వుంటే బాగుండేది" అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది.

More Telugu News